పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి వఖిల్ సబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. వఖిల్ సబ్ మూవీ తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ను అందుకున్న పవన్ కళ్యాణ్ , ఆ తర్వాత భీమ్లా నాయక్ మూవీ తో మరో సక్సెస్ ను అందుకున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే అవ్వడం విశేషం. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాతో పాటే హరిహర వీరమల్లు సినిమాను కూడా మొదలు పెట్టాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ఈ సినిమా షూటింగ్ లో కొంత కాలం క్రితమే మొదలుపెట్టారు. తిరిగి ప్రారంభం అయిన తర్వాత ఒక షెడ్యూల్ షూటింగ్ ను  పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లో తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మాతలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సారి హరిహర వీరమల్లు మూవీతో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్ లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అతి త్వరగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్ర కంటే ముందే కాస్త వీలు చూసుకొని కొన్ని రోజులు కేవలం హరిహర వీరమల్లు సినిమాకే సమయాన్ని కేటాయించి ఈ సినిమా షూటింగ్ ను ముగించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: