ఈ మధ్య కాలంలో మంచి అంచనాలతో థియేటర్ లలో విడుదల అయిన సినిమాలలో విరాట పర్వం సినిమా  ఒకటి. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం దగ్గుబాటి రానా ఈ మూవీ లో హీరోగా నటించడం,  అలాగే సాయి పల్లవి సినిమాలో హీరోయిన్ గా నటించడం,  నీది నాది ఒకే కథ లాంటి ఎన్నో ప్రశంసలు పొందిన సినిమా తర్వాత వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో విరాట పర్వం సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి టాక్ ని బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకుంది. ప్రేక్షకుల నుండి బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో రాబట్టడంలో కాస్త డీలా పడిపోయింది.  ప్రస్తుతం విరాట పర్వం సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేస్తూ వెళుతోంది.  ఇప్పటివరకు 6 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విరాట పర్వం సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 1.30 కోట్లు ,
సీడెడ్ : 22 లక్షలు ,
యూ ఎ : 28 లక్షలు ,
ఈస్ట్ : 19 లక్షలు ,
వెస్ట్ : 13 లక్షలు ,
గుంటూర్ : 19 లక్షలు ,
కృష్ణ : 16 లక్షలు ,
నెల్లూర్ : 9 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 రోజులకు గాను విరాట పర్వం మూవీ 2.56 కోట్ల షేర్ , 4.21 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  0.31 కోట్లు .
ఓవర్ సీస్ లో : 1.06 కోట్లు .
6 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా విరాట పర్వం మూవీ 3.93 కోట్ల షేర్ , 6.77 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: