విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న మొట్టమొదటి మూవీ లైగర్. కరోనాకు ముందు నుండి షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవేమీ ఆ సినిమాను మరిపించలేకపోయాయి. అందుకే ఫ్యాన్స్ కాళీ తీర్చడానికి టాలీవుడ్ దరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో విజయ్ జతకట్టాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగం అయ్యాడు. ఇందులో విజయ సరసన అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా విషయంలో అటు విజయ్ ఫ్యాన్స్ ఇటు పూరి ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏమిటా అని చూస్తే... ప్రమోషన్స్ అని తెలుస్తోంది. ఎంత సినిమా అయినా ప్రేక్షకులలోకి వెళ్ళాలి అంటే ప్రమోషన్స్ అనేది చాలా కీలక అవుతుంది. అయితే ఇప్పటి వరకు లైగర్ నుండి టీజర్ ట్రైలర్ మినహా ఇంకా ఏ విషయం లోనూ ముందుకు వెళ్ళకపోవడం గమనార్హం. అయితే ఈ చిత్ర బృందం సినిమా విడుదల తేదీని 25 ఆగష్టు గా తెలిపింది. ఆ లెక్కన చూసుకుంటే సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అంతమాత్రాన ఏదో ఒక విధంగా అప్డేట్ లు ఇవ్వకుంటే సినిమాపై ఉండే బజ్ కూడా పోతుంది.

ఈ మధ్యలో ఏదో ఒక అప్డేట్ లైక్... సాంగ్ టీజర్, కీలక పాత్రల లీక్, చిత్ర బృందంతో చిట్ చాట్ లు, ఇంటర్వూస్ లాంటివి ప్లాన్ చేయాలి. అయితే పూరి జగన్నాధ్ ఒక్కడే నిర్మాత అయి ఉంటే ఈ పాటికి అప్డేట్స్ ఉండేవి. కానీ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల్లోకి వెళ్లడంతో ఇక అంతా అతని ప్లాన్ లాగా సాగుతోంది.  కరణ్ జోహార్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయడానికి చూస్తున్నాడట. దీనితో విజయ్ ఫ్యాన్స్ విసిగిపోయి ఇకనైనా మేల్కొంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: