ఈమధ్య ముద్దుగుమ్మలు అందరూ సోషల్ మీడియా వెధికగా అందాల నిధిని బయట పెడుతున్నారు..ఒకరిని మించి మరొకరు అందాలతో సెగలు పుట్టిస్తున్నారు. ఇండస్ట్రీ తో పని లేకుండా అందరు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు బాలివుడ్ బ్యూటీ అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా  ఆ జాబితాలోకి వచ్చి చేరింది.జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.శ్రీదేవి మాదిరిగా బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ హీరోయిన్‌గా నిలబెట్టేందుకు ఆమె తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు.


సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ తన పాపులారిటీ పెంచుకుంటూ ఉంటుంది. నెట్టింట గ్లామర్‌ ఫోటోలతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది.వారిని ఫుల్‌ ఖుషీ చేస్తుంది. వారానికి ఒకటి రెండు సార్లు తన అందాల విందుని వడ్డిస్తుంది. నెటిజన్లని నిత్యం తన అటెన్షన్‌లో ఉంచుకుంటోంది. ఫ్యాన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంది. మేకర్స్ చూపులను తనవైపు తిప్పుకుంటోంది. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. జాన్వీ తాజాగా స్టన్నింగ్ లుక్‌లో మైమరిపిస్తూ కేక పెట్టిస్తుంది.


బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.గతేడాది 'రూహి' చిత్రంతో అలరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం 'గుడ్ లక్ జెర్రీ' తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. హిందీ-భాషలో బ్లాక్ కామెడీ క్రైమ్ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ మూవీకి సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, మహవీర్ జైన్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. జూలై 29న ఓటీటీలో రిలీజ్ కానుంది. మార్చిలోనే చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఓటీటీ లో త్వరలో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: