మొదటగా షార్ట్ ఫిలింలో చేస్తూ ఆ తర్వాత సినిమాలలో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా ఎదిగింది హీరోయిన్ చాందిని చౌదరి. ఈమె బాగా కలర్ ఫోటో సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా ఈ చిత్రంతో ఘన విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు తాజాగా సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇందులో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. మాజీ ప్రొడక్షన్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ్ ఈ సినిమాని గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాని జూన్ 24 న ప్రపంచవ్యాప్తంగా విడుదల. ఈ సందర్భంగా హీరోయిన్ చాందిని మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.


చాందినీ చౌదరి మాట్లాడుతూ అల్లు అరవింద్ గారి దీవెన వల్లే తను ఈ పొజిషన్ లో ఉన్ననని తెలియజేసింది. ఆయన నాకే లక్కీ చార్మ్ లా మారిపోయారని తెలియజేసింది. కలర్ ఫోటో తర్వాత మరికొన్ని మంచి కథలు చేయాలని భావించారు ఆ సమయంలోనే మరో అద్భుతమైన కథ వచ్చింది ఆ సినిమానే సమ్మతమే అని తెలియజేసింది. ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు గోపీనాథ్ గారికి ధన్యవాదాలు.. అలాగే కిరణ్ తో పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసింది.


శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్ ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ను తయారు చేశారు. సమ్మతమే గీతా ఆర్ట్స్ లో విడుదల కావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోందని చాందిని చౌదరి తెలిపింది. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మా నిర్మాత ప్రవీణ్ గారు ఎక్కడా కూడా ఈ సినిమా విషయంలో రాజీ పడలేదని తెలియజేసింది. ఈ చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరి టెక్నీషియన్ కి ప్రత్యేక థాంక్స్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని 24 న థియేటర్ లో చూసి ఇ సమ్మతమే అనాలని కోరుకుంటున్నానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: