టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ క్రేజీ దర్శకులలో ఒకరైన లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను జూలై 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ది వారియర్ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ పోతినేని 'ది వారియర్' సినిమా దర్శకుడు అయిన లింగుస్వామి కి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. రామ్ పోతినేని , లింగుస్వామి కి క్షమాపణలు చెప్పడానికి కారణం ఏమిటి అంటే...  తాజాగా ది వారియర్ మూవీ లోని మూడు లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది . ఇందు కోసం చిత్రబృందం ఒక ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో మాట్లాడిన రామ్ పోతినేని దర్శకుడు లింగుస్వామి గురించి మాట్లాడలేదు.

అయితే అలా ఈవెంట్ లో దర్శకుడి గురించి మాట్లాడలేకపోయిన రామ్ పోతినేని సోషల్ మీడియా వేదికగా... అసలు మెయిన్ మ్యాన్ గురించి చెప్పడం నేను మర్చిపోయానని నా ది వారియర్, దర్శకుడు నా మూవీ ని మొదటి నుంచి తన భుజాలపై ఉంచి మోసిన లింగుస్వామి సార్ మీరు నేను వర్క్ చేసిన బెస్ట్ దర్శకుల్లో మీరు కూడా ఒకరు. దయచేసి క్షమించండి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.  రామ్ పోతినేని చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: