లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అనేక రోజులుగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న కమల్ హసన్ కు విక్రమ్ సినిమా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.  

లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ఫహాద్ ఫాజిల్ కీలకమైన పాత్రలో నటించగా,  విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ లో సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లో సూర్య కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ, ఈ సినిమా విజయంలో సూర్య కీలక పాత్ర పోషించాడు. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను రాబడుతోంది. అందులో భాగంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ లను రాబడుతోంది.

మొదటి నుండి తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలు ఉండటంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 7 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న విక్రమ్ సినిమా 7.50 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అతి తక్కువ రోజుల్లోనే ఈ సినిమా 7.50 షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటి వరకు విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.03 కోట్ల షేర్ , 28.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో 21 రోజులకు గాను విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో  8.53 కోట్ల లాభాలను అందుకొని డబల్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: