టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. యువ హీరోయిన్ కృతి శెట్టి మొదటిసారిగా నటిస్తున్న చిత్రం ది వారియర్. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ ఎన్.లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతోంది. ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు హీరో రామ్. ఇక ఈ హీరోని ఢీకొట్టే విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.

ఎట్టకేలకు ఈ చిత్రం జూలై 14న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అందుకోసమే ఈ సినిమా నుంచి వరుస డేట్లు ఇస్తున్నారు చిత్రబృందం. ఇకపోతే ఈ మూవీ పై బోలెడు ఆశలన్ని పెట్టుకుంది హీరోయిన్ కృతి శెట్టి. అందుకు కారణం ఏమిటంటే ది వారియర్ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కాబోతోంది. తెలుగులో ఒకేసారి హ్యాట్రిక్ సినిమాలో తన ఖాతాలో వేసుకుని మంచి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది . ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకులను కూడా మొదటిసారి అలరించబోతోంది.. అందుచేతనే ఈ సినిమా గనుక విజయం సాధిస్తే కోలీవుడ్లో కూడా పూర్తిచేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉన్నదట.

దీంతో అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని కృతి శెట్టి భావిస్తున్నదట. అందుకే ది వారియర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని ఆమె కోరుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.మరి ఆమె ఆశ నిజమైతే ఈ చిత్రం నుండి పలు భాషలలో మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అన్న విషయం తెలియాలంటే వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం కృతి శెట్టి ఇతర ప్రాజెక్టుల విషయంలో చాలా బిజీగా ఉన్నది. తమిళంలో కూడా హీరో సూర్య సరసన ఒక చిత్రంలో నటించబోతున్నదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: