యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లీడ్ రోల్ లో 2014లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయ కి సీక్వల్ గా వస్తున్న సినిమా కార్తికేయ 2. హీరో, డైరక్టర్ కాంబో రిపీట్ అవుతూ చేస్తున్న ఈ సీక్వల్ సినిమాకు మొదటి పార్ట్ కథతో సంబంధం ఉండదని అర్ధమవుతుంది. కార్తికేయ సినిమా 2014లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అప్పటివరకు నిఖిల్ కెరియర్ లో అదే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి డైరక్షన్ టాలెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక ఆ సినిమా తర్వాత చందు మొండేటి కొన్ని సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే మరోసారి తనకు హిట్ ఇచ్చిన కాతికేయతోనే మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు చందు. ఇక నిఖిల్ కూడా కార్తికేయ 2 కోసం బాగా కష్టపడ్డాడు. కార్తికేయ 2 సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కొడుతుందని అనిపించేలా ఉంది. కార్తికేయ 2 కథ ద్వారక నేపథ్యంతో వస్తుంది.

ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. నిఖిల్ సరసన ఈ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. కార్తికేయ 2 తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాతో నిఖిల్ ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడు. కెరియర్ లో సరైన హిట్ లేక సతమతమవుతున్న నిఖిల్ కార్తికేయ 2తో మళ్లీ కెరియర్ లో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. నిఖిల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా నిఖిల్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమాలో కూడా హీరోయిన్ గా అనుపమ నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో ఈ జోడీ సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి అనుకున్నట్టుగా సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: