బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే స్టార్ మా లో సక్సెస్ ఫుల్ గా ఐదు సీజన్ లను పూర్తి చేసుకోగా బిగ్ బాస్ ఓటీటీ అదేనండి బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ డిస్నీ హాట్ స్టార్ లో కూడా మొదటి ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ఓటీటీ అనేది తెలుగులో ఓ పెద్ద ప్రయోగమే అని చెప్పొచ్చు. అయితే బిగ్ బాస్ ఆడియెన్స్ మాత్రం దాన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. స్టార్ మా లో వచ్చే బిగ్ బాస్ సీజన్ కి సమానంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది.

ఇక ఇదిలాఉంటే కొద్దిపాటి బిగ్ బాస్ టీవీ ఆడియెన్స్ మాత్రం ఓటీటీలో బిగ్ బాస్ చూడలేకపోయారు. ఆ వర్గం వారు మాత్రం బిగ్ బాస్ అంటే స్టార్ మాలోనే రావాలి మేము చూసి ఓటేయాలి అనే విధంగా ఉన్నారు. అయితే వారే కాదు బిగ్ బాస్ నాన్ స్టాప్ చూసి ఓటేసిన కొందరు ఆడియెన్స్ కూడా బిగ్ బాస్ మెయిన్ స్ట్రీం అదే స్టార్ మా లో వచ్చే సీజన్ బాగుందని.. ఓటీటీ పెద్దగా క్లిక్ అవలేదని చెబుతున్నారు. దీన్ని ఫీడ్ బ్యాక్ గా తీసుకుంటున్నారు బిగ్ బాస్ టీం.

అంతేకాదు బిగ్ బాస్ నాన్ స్టాప్ చేయడం వల్ల స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 6 కి కూడా ఏమంత గొప్ప ప్రేక్షకాదరణ ఉండదని కొందరు అంటున్నారు. ఏ సీజన్ కి ఆ సీజన్ గొప్ప గా ఉంటుంది. మొదటి నుంచి ఫాలో అయితే ఆటోమెటిక్ గా బిగ్ బాస్ కి అలవాటు అవుతారు. బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ మాలో త్వరలో మొదలవుతుంది. ఈ సీజన్ లో టాప్ సెలబ్రిటీస్ ప్రేక్షకులని అలరించడానికి వస్తారని తెలుస్తుంది. సీజన్ 6ని కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తారని తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: