తన గతంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని బాలీవుడ్ నటి సోనా మహాపాత్ర కొన్ని విషయాలను తెలియజేసింది. తనని హత్యచారం బెదిరింపులు రావడం వల్ల తనకు నిద్ర కూడా పట్టలేదని తాను తన భర్త ఎంతో కుమిలిపోయామని తెలియజేసింది. సుల్తాన్ ప్రచార కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ తన విలేకరుల సమావేశంలో తనను రేప్ గురైన మహిళతో పోల్చడం ఆ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది చాలామంది ఈ వాక్యాలు సరి కాదని కూడా తెలియజేశారు. దీంతో ఈమె కూడా సల్మాన్ ఖాన్ ని విమర్శించడం జరిగింది.


నిక్ జోనాస్ ను వివాహం చేసుకోవడానికి ప్రియాంక చోప్రా ఒక ఇండియన్ మూవీని వదులుకోవడం పై సల్మాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు సో నా కూడా ఆ వార్తలను ఖండించింది. దీంతో ఆమె ప్రియాంక చోప్రా కు మద్దతు ఇచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ అభిమానులు తనని సామూహికంగా అత్యాచారం చేస్తానని బెదిరించినట్లు సోనా వెల్లడించింది. సల్మాన్ ఖాన్ ఖండించినందుకు తనను రేప్ చేస్తానని బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని పోర్న్ వెబ్సైట్లో మార్ఫింగ్ చేసి ఫోటోలు కూడా మార్ఫింగ్ చేశారని సొన మహాపాత్ర తెలిపారు.


సల్మాన్ ఖాన్ భారత్ లో నటించడం కంటే నిక్ జోనస్ ను వివాహం చేసుకోవాలని ప్రియాంక చోప్రా తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధించడం వల్లే ఇదంతా జరిగిందని సోనా మాట్లాడింది. ఇక సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక ప్రకటనలో పాల్గొన్నప్పుడు తన లంచ్ బాక్స్ లో కూడా ఈమే కు బెదిరింపు లేఖలు వచ్చాయని తెలియజేసింది. ఇక అంతే కాకుండా అత్యంత భయంకరమైన పోలింగ్ లకు గురయ్యానని తెలియజేసింది. ఆ విషయం అక్కడితోనే వదలక గ్యాంగ్ రేప్ బెదిరింపులు కూడా తీవ్రం అయింది అని తెలియజేసింది. సోనా తన బాధాకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. దీంతో తన కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: