పంజా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టి అదిరిపోయే రికార్డ్ ను సంపాదించుకున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.  

ఇలా మొదటి సినిమాతోనే తన స్టామినాను బాక్సాఫీస్  దగ్గర నిరూపించుకున్న ఈ మెగా హీరో ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండాపొలం అనే ప్రయోగాత్మకమైన చిత్రంలో హీరోగ్స్ నటించాడు. ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ కు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నప్పటికీ కమర్షియల్ విజయం మాత్రం దక్కలేదు. అలా మొదటి సినిమాతో కమర్షియల్ గా అదిరిపోయే విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ కు సంబంధించి చిత్ర బృందం ఒక అప్డేట్ ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించి చిత్ర బృందం వైష్ణవ్ తేజ్ కు సంబంధించిన సగం పోస్టర్ ను విడుదల చేసింది. మిగతా సగం పోస్టర్ కోసం త్వరలో హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి అంటూ బృందం పోస్ట్ చేసింది. దీనితో మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా టీజర్ అప్డేట్ రానున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: