టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీతా గోవిందం , టాక్సీ వాలా వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి యూత్ లో ఫుల్ క్రేజ్ ను దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఆఖరుగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది .

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ లో ఒక సాంగ్ షూటింగ్ మినహాయించి మొత్తం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ చిత్రీకరణ ను కూడా ఈ చిత్ర బృందం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ను విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే లపై చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది.

ఈ సాంగ్ ను ముంబై లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ , అనన్య పాండే లపై ఈ సాంగ్ ని చిత్రీకరించినట్లు అయితే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ పూర్తి అవగానే లైగర్ చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: