తాజాగా అక్కినేని నాగచైతన్య హీరోగా 'థాంక్యూ' అనే చిత్రం రూపొందిందన్న సాంగ తి తెలిసిందే. అయితే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు.ఇదిలావుంటే నాగ చైతన్య- విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో గతంలో 'మనం' అనే క్లాసిక్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కాగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ వంటి భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇకపోతే ఒక్కో స్టేజిలో ఒక్కొక్కరు హీరోయిన్ గా కనిపిస్తారు అని తెలుస్తుంది. ఇక ఆల్రెడీ ఈ చిత్రం నుండీ విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది.కాగా  'మారో' 'ఏంటో ఏంటేంటో'…వంటి పాటలు కూడా ఆకట్టుకున్నాయి.అయితే ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. మొదట ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.పోతే  ఆ డేట్ కు ఈ చిత్రం రిలీజ్ కావడం లేదు. మళ్ళీ ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.కాగా జూలై 22న 'థాంక్యూ' మూవీ రిలీజ్ కాబోతుంది. ఇకపోతే షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.

ఇక అందుకు ప్రధాన కారణం సంగీత దర్శకుడు తమన్ అని టాక్. అయితే వరుసగా పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న తమన్… 'థాంక్యూ' ఆర్.ఆర్ ఇంకా ఫినిష్ చేయలేదట.ఇక  దిల్ రాజు కూడా ఆర్.ఆర్ ని వెంటనే ఓకే చేసే రకం కాదు.అయితే అందుకే ఈ చిత్రం విడుదల మరో రెండు వారాలు ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఇకపోతే పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించారు.ఇక  'జోష్' తర్వాత సుమారు 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత దిల్ రాజు- నాగ చైతన్య కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: