నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన  ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు మినిమమ్ వసూళ్లను అందుకుని పెట్టిన పెట్టుబడి తప్పకుండా వెనక్కి తెస్తుంది.ఇక  ఇది నిర్మాతలలో ఒక బలమైన నమ్మకం అయితే కొనసాగుతూ వస్తోంది.ఇటీవల కాలంలో నాని సినిమాలు థియేట్రికల్ బిజినెస్ లో పెద్దగా లాభాలను అందించడం లేదు. ఇక ఇంతకు ముందు వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఆ సినిమా నష్టాలను మిగిల్చింది.తాజాగా ఇప్పుడు 'అంటే.. సుందరానికి' సినిమా కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో దాదాపు అన్ని ఏరియాల్లో నష్టం కలిగిస్తున్నట్లు సమాచారం. 

అయితే తదుపరి సినిమా విషయంలో మాత్రం అలా జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కంటే నాని మంచి నెక్స్ట్ రాబోయే దసరా సినిమా మాత్రం అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నా కెరీర్ కు చాలా ముఖ్యమైనది. అయితే కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే మొన్నటి వరకు అంటే సుందరానికి అనే సినిమా హడావుడిలో బిజీగా ఉన్న నాని ఇప్పుడు మొత్తంగా దసరా సినిమాపై ఫోకస్ పెట్టాడు. అయితే కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నాని అయితే చాలా నమ్మకంతో ఉన్నాడు.

అంతేకాక ఈ సినిమా కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా తన లుక్ మొత్తం మార్చేసాడు.అయితే  విభిన్నమైన గెటప్ లో తన హ్యాండ్సమ్ లుక్ మొత్తం పక్కన పెట్టేసి కంప్లీట్ గా ఊరమాస్ గెటప్లో కి మారిపోయాడు. ఇక తప్పకుండా దసరా మాస్ ఆడియన్స్ లో తన స్థాయిని పెంచుతుంది అని గట్టిగానే కష్టపడుతున్నాడు.ఇదిలావుంటే ఇటీవల కాస్త ప్రశాంతత కోసం గోవా వెళ్లిన నాని వెంటనే తిరిగి వచ్చేశాడు.రెగ్యులర్ గా దసరా సినిమా పనుల్లో బిజీ కాబోతున్నాడు.  దసరా సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నారు.అయితే  మరి నాని బిగ్ బడ్జెట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటటాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: