నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన ఆహా 'ఓ టి టి' లో ఆన్ స్థాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. మొట్ట మొదటి సారి బాలకృష్ణ ఒక షో కు హోస్ట్ గా వ్యవహరించడంతో మొదటి నుండే ప్రేక్షకులు ఈ టాక్ షో పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్లు గానే బాలకృష్ణ తన మేనరిజంతో, డైలాగ్ లతో,  కామెడీ పంచ్ లతో ఆద్యంతం ఈ షో ను రక్తి కట్టించి ఈ షో ను సూపర్ హిట్ చేశాడు.  ఇది ఇలా ఉంటే ఆన్ స్థాపబుల్ సీజన్ 1 సూపర్ సక్సెస్ కావడంతో మరి కొద్ది రోజుల్లో ఆన్ స్థాపబుల్ సీజన్ 2  ప్రారంభం కాబోతోంది. ఈ టాక్ షో మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో రెండవ సీజన్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా మొదటి సీజన్ 2 కోసం ఆన్ స్థాపబుల్  నిర్వహణ బృందం అదిరిపోయే స్పీచ్ వేసినట్లు తెలుస్తోంది.  అందులో భాగంగా ఆన్ స్థాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ని గెస్ట్ గా తీసుకురావాలని చిత్ర బృందం ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కనుక మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చినట్లయితే షో మీద క్రేజ్ మరింతగా పెరుగుతుంది అని, అలాగే బాలకృష్ణ , చిరంజీవి ఒకే స్టేజి పై ఉంటే ఫాన్స్ కూడా సంతోష పడతారు అనే ఉద్దేశంతో ఆన్ స్థాపబుల్ నిర్వహణ బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: