గతం లో బన్నీ హరీష్ శంకర్ కాంబినేషన్ లో దువ్వాడ జగన్నాథం సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో నెగిటివ్ టాక్ వచ్చినా బన్నీ తన పర్ఫామెన్స్ తో ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.ఇకపోతే బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాపై దృష్టి పెట్టారనే సంగతి తెలిసిందే.ఇక  భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అయితే ఈ సినిమా తర్వాత బన్నీ నటించే సినిమా ఏదనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. 

బన్నీ భారీ ప్రాజెక్ట్ నే ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎవరి డైరెక్షన్ లో తెరకెక్కనుందనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.పోతే డీజే విడుదలై ఐదు సంవత్సరాలు కావడంతో బన్నీని హరీష్ శంకర్ కలిశారని తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.అయితే తాజాగా హరీష్ శంకర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా బన్నీతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. అంతేకాక హరీష్ శంకర్ తర్వాత సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో తెరకెక్కనుంది. ఇక ఇప్పటికే హరీష్ శంకర్సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు.

కాగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇకపోతే పవన్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా మరోవైపు సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇదిలావుంటే బన్నీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఇక  బన్నీ రెమ్యునరేషన్ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.అయితే  బన్నీ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది.ఇక ఈ  సినిమాసినిమాకు బన్నీ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: