అక్కినేని నాగచైతన్య హీరోగా థాంక్యూ అనే సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పలు అప్డేట్లు అంచనాలను పెంచాయి. అక్కినేని అభిమానులు అయితే ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని అంటున్నారు. పోయిన ఏడాది లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హీరో నాగచైతన్య ఇప్పుడు ఈ సినిమాతో అదే హిట్ జోష్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.

అభిమానులు కూడా ఈ సినిమా విజయం సాధిస్తే నాగచైతన్య నెక్స్ట్ లెవెల్ హీరోగా మారతాడనీ అంటున్నారు. మరి ఇన్ని అంచనాలు ఉన్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. వాస్తవానికి ఈ సినిమా జూలై 17 వ తేదీన విడుదల కాబోతుంది అని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ విడుదల తేదీని మార్చాలని భావిస్తోందట చిత్ర బృందం.  కారణమేంటో తెలియదు కానీ వారిలో ఈ విధమైన భావన నెలకొంది విడుదలపై. 

త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించబడుతుంది. మరి అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా విడుదల కాకముందే ఈ హీరో మరియు దర్శకుడు ఇద్దరూ కలిసి దూత అనే ఓ వెబ్ సిరీస్ ను చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ యొక్క షూటింగ్ మొదలు కాగా త్వరలోనే దానిని పూర్తి చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మరి థాంక్యు సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడవలసిందే. తమన్సినిమా కి సంగీతం సమకూరుస్తున్నారు. హీరోయిన్ గా రాశీ ఖాన్న కు కోడా ఈ సినిమా విజయం తప్పనిసరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: