ఉప్పెన సినిమా తో సంచలన విజయాన్ని నమోదు చేసుకొని తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ కృతి శెట్టి.  తొలి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను ఈ స్థాయిలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ తన అభిమానులను అలరించడానికి సిద్దం గా ఉంది. అందానికి అందం అభినయానికి అభినయం కలిగి ఉండడంతో ఈ ముద్దుగుమ్మ ను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. 

ప్రస్తుతం కొన్ని క్రేజీ సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ వాటి ద్వారా మంచి విజయాలను అందుకొని మరిన్ని పెద్ద అవకాశాలు రాబట్టుకోవాలని చూస్తుంది. తాజాగా నాగచైతన్య సినిమా ఒప్పుకుంది. ఆయనతో రెండో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.  అయితే ఆమె చేస్తున్న సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయో చూడాలి. ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ అనే సినిమాలో ఈమె నటించింది ల. ఈ చిత్రం మంచి క్రేజీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నగా జూలైలో ఈ సినిమా యొక్క భవిష్యత్తు తెలియబోతుంది. 

ఇకపోతే కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న మరొక సినిమా సుధీర్ బాబు సరసన చేస్తున్న ఈ అమ్మాయి గురించి చెప్పాలి. ఈ చిత్రం కూడా మంచి కథా కథనాలు కలిగి ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం చేయడానికి ఒప్పుకుంది కృతి శెట్టి. ఇప్పుడు ఆమె ఉన్న ఫామ్ లో ఈ చిత్రాలు హిట్ అవుతాయని చెప్పాలి. అవకాశాలకు తోడు విజయాలు వస్తే ఆమె కెరీర్ కు దోకా ఉండదు. ఆమె కు మంచి ఫ్యూచర్ ఉండాలంటే ఈ రెండు చిత్రాలు భారీ విజయాలను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే యూత్ తో పాటు ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె భవిష్యత్తులో ఏ స్థాయి హీరోయిన్ గా మారుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: