త్రివిక్రమ్ ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. క్లాస్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించి మాస్ హిట్స్ ను సాధించే ఈ దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంతకుముందు అల్లు అర్జున్ తో కలిసి ఆయన చేసిన అల వైకుంఠ పురం లో సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.  ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగ రాస్తుంది. అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు.

ఆ విధంగా ఇప్పుడు మహేష్ బాబు తో ఆయన సినిమా చేస్తూ ఉండగా అభిమానులు మహేష్ సినిమా తో భారీ విజయాన్ని ఇవ్వాల్సిందే అని త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్లను అందుకున్నాయి. దాంతో ఇప్పుడు చేయబోయే ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించి మంచి కథ కథనాలను త్రివిక్రమ్ రెడీ చేశాడని అంటున్నారు.

త్వరలోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సిని మా  చేస్తున్నాడు. అలా ఈ రెండు సినిమాలతో రికార్డులను అందుకోవాలని మహేష్ అభిమానులు చెబుతున్నారు. రాజమౌళి తో చేయబోయే సినిమా కంటే ముందు చేసే సినిమా అయిన ఈ సినిమా ద్వారా అందరికీ సూపర్ హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ కు ఈ రకమైన రిక్వెస్ట్ లు చేస్తున్నారు మహేష్ అభిమానులు. మరి త్రివిక్రమ్ వారి కోరికను నెరవేరుస్తాడా అనేది చూడాలి. అయన సినిమాలకు ఫ్యాన్స్ గట్టిగానే ఉంటారు. పెద్ద హీరోలను డీల్ చేయడం ఈ దర్శకుడికి బాగానే తెలుసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: