టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్సినిమా చేయడానికి అంతకంతకూ ఆలస్యం చేస్తూ ఉండడంతో హరీష్ శంకర్ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు అనే వార్తలు ఇప్పుడు జోరుగా వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ తో ఆయన తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని చాలామంది కోరుకున్నారు.

ఇద్దరికీ కుదరకపోవడంతో కొన్ని సంవత్సరాలపాటు వీరి కాంబో సినిమా తెరపైకి రాలేదు. ఇప్పుడు భగదీయుడు భగత్ సింగ్ సినిమా రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలు కావలసి ఉంది. కానీ ఇంకా మొదలు కాలేదు. మైత్రి మూవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేయవలసి ఉంది కానీ కారణం ఏమిటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి అంతకంతకు ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇతర సినిమాలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చేయడానికి ఎందుకో ఆయన ముందుకు రాకపోవడం అందరినీ నిరాశపరుస్తుంది. ముఖ్యంగా పవన్ అభిమానులు ఈ సినిమా మొదలు కాకపోవడం పట్ల నిరాశ పడు తున్నారు అని చెప్పాలి. 

దాంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన హరీష్ శంకర్ ఇంకా పవన్ డేట్స్ సమకూర్చక పోవడం తో ఇప్పుడు మరో హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఆశ తగ్గిపోగా ఇప్పుడు అల్లు అర్జున్ ను ఆయన కలవడం వారి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అనడానికి సాక్ష్యంగా మారింది.  మరి గతంలో డీజే వంటి సూపర్ హిట్ చిత్రాన్ని చేసిన ఈ కాంబో మళ్లీ సినిమా చేస్తుందా అనేది చూడాలి. మరీ హరీష్ శంకర్ తన తదుపరి సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో. 

మరింత సమాచారం తెలుసుకోండి: