టాలీవుడ్
సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడు గా వెలుగొందిన దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పుడు ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా లేరు ఆయనతో
సినిమా చేయాలని ఎదురు చూసిన ఎంతో మంది హీరోలు ఇప్పుడు ఆయనకు అవకాశాలు ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు మహేష్ బాబు ఆగడు సినిమాతో ఆయన చిత్రాలు ఫ్లాప్ అవ్వడం మొదలు పెట్టాయి. అంతకు ముందు అయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.
కామెడీ ని సెంటర్ చేసుకుని అయన చేసే సినిమాలు సూపర్ హిట్ లు అయ్యేవి. అదే విధంగా ఆ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధించేవి కనీ ఎప్పుడైతే ఆయనకు ఫ్లాప్ లు రావడం మొదలుపెట్టాయో అప్పటినుంచి వరుస మారిపోయింది. ఆగడు
సినిమా ఆయనకు బ్యాడ్ ఫేజ్ ను తెచ్చిపెట్టింది.
ఆ విధంగా ఆగడు తర్వాత చేసిన బ్రూస్లీ అలాగే
మిస్టర్ వంటి చిత్రాలు భారీ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఈ దర్శకుడికి
సినిమా ఇవ్వడానికి ఏ
హీరో కూడా ముందుకు రాలేక పోతున్నాడు దాదాపు అని అనుకుంటున్న సమయంలో వారి కాంబినేషన్లో గతంలో రూపొందించిన బి
సినిమా సీక్వల్ b&d సినిమాను చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు ఏమాత్రం బయటకు రాకపోవడం విష్ణు కూడా మరొక
సినిమా అనౌన్స్మెంట్ చేయడంతో ఈ చిత్రం ఉంటుందో ఉండదు అన్న అనుమానాలను కలిగిస్తుంది.
దాంతో ఇప్పుడు
శ్రీను వైట్ల మరొక
సినిమా చేయవలసిన అవసరం ఏర్పడింది ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఏ హీరోతో ఆయన
సినిమా చేస్తాడు అనేదే అసలు ప్రశ్న. పెద్ద హీరోలు ఎవరూ కాళీగా లేరు చిన్న హీరోలందరూ కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు ఈ నేపథ్యంలో
శ్రీను వైట్ల కావాలంటే ఇలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించాలో చూడాల్సి ఉంది.