తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కి ప్రస్తుతం అవకాశాలు రాకపోయినా కానీ ప్రేమ పాఠాలు మాత్రం బాగానే నేర్చుకుంటుంది. తన లవ్ ముచ్చట్లతో ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.


ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తో డేటింగ్‌లో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ఇప్పటికే బాగా ట్రోల్ చేశారు. అయితే, అవేమి పట్టించుకోని ప్రియాంక.. మరో ఫోటో పోస్ట్ చేసిందట 


ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ఫోటోలో ఎవరు ఉన్నారు అంటే.. ప్రియాంక ఓ రెస్టారెంట్‌లో ఒక అబ్బాయితో ఫోటో దిగింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఐతే, ప్రియాంక తెలివిగా తన బాయ్ ఫ్రెండ్ ను బ్యాక్ నుంచి చూపించిందట.. ఐతే, ఆమెతో ఫొటోలో ఉన్న వ్యక్తి ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యరే అని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.నెటిజన్ల కామెంట్లకు తగ్గట్టుగానే.. బ్యాక్ నుంచి నెక్ భాగం అచ్చు వెంకటేశ్ లానే ఉందట.. పైగా.. ప్రియాంక ఈ ఫోటోలు షేర్ చేస్తూ 'అతనే లవ్' అంటూ హార్ట్ ఎమోజీని కూడా పోస్ట్ చేసింది. మొత్తానికి ప్రియాంక జవాల్కర్ ప్రేమ పాఠాలతో తెగ వైరల్ అవుతుంది. ఆ మధ్య ప్రియాంక తన ఇన్‌ స్టాలో షేర్ చేసిన ఓ ఫొటోకు అయ్యర్ 'క్యూట్' అంటూ రిప్లై కూడా ఇచ్చి తెగ సిగ్గుపడిపోయాడు.


మనోడు చేసిన మెసేజ్ చూసిన ఈ బబ్లీ బ్యూటీ 'హు యూ' అంటూ అమాయకంగా ఏమి తెలియని అమ్మాయిలా ప్రశ్నించిందట.. కట్ చేస్తే.. అమ్మడు అతనితో ఓ పబ్ లో కనిపించింది. ఏది ఏమైనా ముంబై భామలకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నా.. ఎందుకో టాలీవుడ్ మేకర్స్ మాత్రం ప్రియాంక జవాల్కర్ ను చిన్న చూపే చూస్తున్నారు.అందుకే, చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రియాంక జవాల్కర్.


అదృష్టం కలిసి వచ్చి.. మధ్యలో ఆమె చేసిన రెండు సినిమాలు 'తిమ్మరుసు', 'SR కల్యాణమండపం' కూడా ఆమె కెరీర్ కి అంతగా ఉపయోగపడలేదు. అదేమిటో రెండు సినిమాలకు పర్వాలేదు అనే టాక్ వచ్చినా.. ప్రేక్షకుల వైపు నుంచి మంచి ఆదరణ లభించినా.. విచిత్రంగా ఈ రెండు సినిమాలు ప్రియాంక జవాల్కర్ ఏ రకంగానూ ప్లస్ కాలేదు. పైగా ప్లస్ కాకపోగా పెద్ద మైనస్ కూడా అయింది. మొత్తానికి ఈ భామ ప్రస్తుతం అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. మధ్యలో ఇలా ప్రేమ పుకార్లతో సేద తీరుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: