మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటన అయ్యింది. ఇద్దరు కూడా పలుమార్లు వీరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఓ పెద్ద హీరోను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మహేష్ బాబు కూడా ఇంతటి భారీ బడ్జెట్ తో కూడిన చేయడం ఇదే తొలిసారి. ఇన్ని ఆసక్తికర విశేషాలు కలిగిన ఈ సినిమా ఏ విధంగా తెరకెక్కుతుందన్న ఇంట్రెస్ట్ అందరిలో ఉంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకొని మహేష్ బాబు కోసం ఎదురు చూస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ఆ తర్వాత రాజమౌళి సినిమాను మొదలు పెట్టాలని మహేష్ బాబు ఆలోచన. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజమౌళి ఈ సినిమాను మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. 

అయితే రాజమౌళితో సినిమా కోసం మహేష్ బాబు కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. స్క్రిప్టు విషయంలో  ఫైనల్ నిర్ణయం తానే తీసుకోవాలని మహేష్ ఆయనకు కండీషన్ పెట్టారట. అందుకనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అని తెలుస్తుంది. రాజమౌళి కూడా ఒకసారి స్క్రిప్ట్ ఓకే అయ్యాక పెద్దగా మార్పులు చేయరు కాబట్టి ఈ కండిషన్ కు ఆయన సింపుల్ గా ఒప్పుకున్నాడట. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆస్కార్ నామినేషన్ కి కూడా వెళుతున్న రాజమౌళి ఈ సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తాడో అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటిదాకా దేశం మొత్తం గర్వించదగ్గ సినిమాలు చేసిన రాజమౌళి ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టాలీవుడ్ అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: