రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది వారియర్. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ మసాలా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండటం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ నేపథ్యంలో జూలై 17 వ తేదీన రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో  చూడాలి. వాస్తవానికి రామ్ వరుస విజయాలతో జోరు మీద ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ ఆలోచనా తీరు ఒక్కసారిగా పూర్తిగా మార్చేసిందని చెప్పాలి.

ఆ తర్వాత చేసిన రెడ్ అనే రీమేక్ సినిమా రెడ్డి కూడా ఆయనకు పర్వాలేదు అనిపించుకునే హిట్ ను అందించింది. ఈ నేపథ్యంలోనే ఈ అంచనాల మధ్య చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని అవసరం ఏర్పడింది.  ఇప్పుడు టైర్ 2 హీరోల జాబితాలో ఉన్నాడు రామ్.  ఈ సిని మా కనుక విజయం సాధిస్తే తప్పకుండా టైర్ 1 హీరోల జాబితాలో చేరడం ఖాయం అని చెబుతున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో రామ్ ఏవిధమైన విజయాన్ని తన ఖాతాలో ఈ సినిమా ద్వారా వేసుకుంటాడో చూడాలి.

సినిమా మాత్రమే కాకుండా ఆయన రాబోయే సినిమాల ద్వారా కూడా సంచలన విజయాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది కూడా మాస్ మసాలా సినిమా కావడంతో రామ్ యొక్క ఇంటెన్షన్ పూర్తిగా అర్థమవుతుంది. మాస్ సినిమాలు చేసి మాస్ ప్రేక్షకులను ఎక్కువగా అలరించడానికి సిద్ధమవుతున్నాడు అని దీన్ని బట్టి తెలుస్తుంది. మరి  రామ్ కోరుకుంటున్న ఈ ఆశ నెరవేరుతుందా అనేది ఈ సినిమా రిజల్ట్ ను బట్టి తెలుస్తుంది. కాబట్టి మరికొన్ని రోజులు వేచి చూస్తే గాని అది ఏంటో తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: