టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థ గా ఉన్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో పుష్ప సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన అంటే సుందరానికి సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశపరచడంతో వారికి కొన్ని కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. నాని హీరోగా నటించిన ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు కానీ ఆ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

దీంతో ఈ దాన్ని భర్తీ చేయాలంటే వెంటనే వారికి మరొక భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ విధంగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ఖుషి తప్పకుండా హిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ టైగర్ తర్వాత విడుదల చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. 

సమంత క్రేజ్ కూడా ఈ సినిమాకి తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఆమె విడాకుల తర్వాత నటిస్తున్న పెద్ద సినిమా కమర్షియల్ సినిమా ఇదే కావడం విశేషం. ప్రేమకథా చిత్రాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించింది దర్శకుడైన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఈ సినిమా తప్పకుండా హిట్ అవడానికి ఆస్కారం ఉందని అందరు నమ్ముతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతు ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా లో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ అవబోతుంది అంటున్నారు. ఇప్పటికే కాశ్మీర్ లో ఓ షెడ్యుల్ పూర్తయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: