యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించనుండగా,  తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

మూవీ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి అందించిన సాంగ్ లలో నుండి చిత్ర బృందం మూడు సాంగ్ లను విడుదల చేయగా ఈ సాంగ్స్ కి విశేష స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుండి చిత్ర బృందం మొదట విడుదల చేసిన బుల్లెట్ సాంగ్  మాత్రం అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకాదరణను సంపాదించుకొని,  బుల్లెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. బుల్లెట్ సాంగ్ ను తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేశారు. ఇప్పటి వరకు తెలుగు మరియు తమిళ భాషలలో కలిపి బుల్లెట్ సాంగ్ 125 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించింది. ఇలా ప్రేక్షకుల నుండి ఈ సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడంతో చిత్ర బృందం తాజాగా ఈ సాంగ్ 125 మిలియన్ వ్యూస్ ను సాధించినట్టు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ పాటను తమిళ నటుడు అయిన శింబు పాడాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషలలో జూలై 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రామ్ పోతినేని కెరీర్ లో మొట్టమొదటిసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. దానితో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: