ప్రస్తుతం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ లలో పక్కా కమర్షియల్ సినిమా  ఒకటి . ఈ మూవీ లో గోపీచంద్ హీరోగా నటించగా రాశి కన్నా హీరోయిన్ గా నటించింది . మారుతిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా మధ్యలో మారుతి మంచి రోజులు వచ్చాయి మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యింది .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జూలై 1 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పక్కా కమర్షియల్ చిత్రం బృందం లోని సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో మరియు సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు . అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమా గురించి మాట్లాడుతూ... పక్కా కమర్షియల్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఈ సినిమా ఆద్యంతం అదిరిపోయే కామెడీతో కొనసాగుతోంది.

ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయే రేంజ్ స్టైల్స్ లో ఉంటాయి. హీరో , హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది అని తాజా ఇంటర్వ్యూ లో గోపిచంద్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే గోపిచంద్ 'పక్కా కమర్షియల్' మూవీ లో లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో గోపీచంద్ ఇలాంటి విజయ్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: