ఇండియాలో ప్రస్తుతం కరోనా అనే పదం వినిపించిన వెంటనే అందరికీ గుర్తుకు వచ్చే రియల్ హీరో సోను సూద్.. ఇ హీరో చారిటీ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు సహాయం అందించారు. కరోనా ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ సమయాలలో ఈ హీరో నుండి పొందిన సహాయం వారు కొన్ని వేలల్లో ఉంటారు అని చెప్పవచ్చు. అలాంటి సోనుసూద్ సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయారు ఇటీవలె చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా కనిపించారు . అయితే కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సోనుసూద్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.


సీరియల్ హీరో ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా  బాహుబలి -2 లో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. అందులో చిన్న పాత్ర అయినా కూడా ఎక్కువ రోజులపాటు డేట్లు అడగడం వల్ల రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను ఈయన తిరస్కరించాడట. ఈ విషయాన్ని స్వయంగా సోనుసూద్ ఇటీవల ఒక చిట్ చాట్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం కాస్త వైరల్గా మారుతోంది. సోను సూద్ మాట్లాడుతూ.. రాజమౌళి గారు బాహుబలి 2 సినిమా కోసం తనని సంప్రదించారు. ఆ సమయంలో బల్క్ డేట్లు కావాలని అడిగారు.


అప్పుడు తన సినిమా కమిట్మెంట్ వల్ల రాజమౌళి గారు అడిగిన డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయాను అందుచేతనే ఆ సినిమాలో నటించలేదు పోయానని తెలియజేశారు. కానీ ఆ చిత్రంలో ఏ పాత్రకు రాజమౌళి తన ని  అడిగారు అన్న విషయాన్ని మాత్రం సోనుసూద్ తెలియజేయలేదు. అయినా వారి మధ్య డేట్ల విషయం వరకు చర్చ జరిగి ఉంటుందని డేట్స్ ఓకే అయ్యింటే అప్పుడు పాత్ర ఏంటి అనే విషయాన్ని రాజమౌళి క్లారిటీ ఇచ్చేవారు అన్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి అసలు విషయం తెలియాలి అంటే కేవలం రాజమౌళి గారు నోరు విప్పితే తెలుస్తుందని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: