తెలుగు అగ్ర హీరో వెంకీ ఒకప్పుడు ఫ్యామిలీ కథా చిత్రాలను మాత్రమే చేస్తూ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నారు..ఇప్పటివరకు ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులను అందించారు..ఈ మధ్య ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే హీరో విక్టరీ వెంకటేష్. దర్శకనిర్మాతలు సైతం ఏదైనా మల్టీస్టారర్ సబ్జెక్ట్ ఉందంటే, ముందుగా వెంకీ మామ పేరునే తలుచుకుంటారు..


తెలుగులో మిగతా హీరోలకంటే కూడా ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్ అలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఆయన ఈ ట్రెండ్‌ను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత ఈ ట్రెండ్ మరింత జోరందుకుంది.ఈ మధ్య వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలలో నటించారు..యంగ్ హీరో వరుణ్ తేజ్‌తో కలిసి వెంకీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వెంకీ చేసిన కామెడీకి సినిమా థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. అంతేగాక, ఇప్పుడు తన అన్న కొడుకైన రానా దగ్గుబాటితో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్‌సిరీస్‌లోనూ వెంకీ నటిస్తున్నాడు. దీంతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాలీ సినిమాలోనూ వెంకీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


ఇలా వరుసగా మల్టీస్టారర్ మూవీల్లో నటిస్తున్న వెంకీ, ఇప్పుడు మరో మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్నాడట. దర్శకడు శ్రీకాంత్ అడ్డాల తాజాగా ఓ మల్టీస్టారర్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అన్ని ఎమోషన్స్ కలిగి ఉండేలా ఆయన తీర్చిదిద్దనున్నాడట. ఇక ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు మరో స్టార్ హీరో మాస్ రాజా రవితేజ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వీరిద్దరికీ కథను వినిపించి ఫైనల్ చేయిస్తే, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు దర్శకడు శ్రీకాంత్ అడ్డాల. మరి వెంకటేష్ ఇలా వరుసగా మల్టీస్టారర్ సినిమాలకే పరిమితం అవుతాడా.. సోలో హీరోగా వెంకీ నుండి థియేటర్‌లో సినిమా వచ్చి చాలా రోజులవుతుందని ఆయన అభిమానులు బాధపడుతున్నారు..మరి ఈ విషయం పై వెంకీ ఏమంటాడో చూడాలి.. ఒకటైన సోలో సినిమా చేస్తాడేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: