మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమాలో అవకాశం వస్తే దాదాపు ఎవరు అయినా కూడా ఆ అవకాశాన్ని తిరస్కరించకుండా ఓకే చేస్తూ ఉంటారు. కానీ మలయాళ నటుడు మరియు దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి నుండి వచ్చిన ఆఫర్ లను  రెండుసార్లు తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఒకసారి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక కీలక పాత్ర గురించి సంప్రదించగా కొన్ని కారణాల వల్ల ఈ హీరో ఆ సినిమాలో నటించినట్లు,  అలాగే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఒరిజినల్ లూసిఫర్ మూవీ ని పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించ వలసిందిగా చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ కోరగా కొన్ని కారణాల వల్ల నో చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  తాజా ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ చిరంజీవి నుండి వచ్చిన ఆఫర్ ల గురించి చెప్పుకొచ్చాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... చిరంజీవి ‘లూసిఫర్‌’ మూవీ ని రీమేక్‌ చేయడం సంతోషంగా ఉంది.  చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌కు ఆ కథ కరెక్ట్ గా సెట్ అవుతుంది.  నన్ను దర్శకత్వం వహించమని చిరంజీవి అడిగారు. కానీ ఆ టైమ్ లో నాకు కుదరలేదు. అంతకుముందు ‘సైరా నరసింహ రెడ్డి’ మూవీ లో  ఓ పాత్ర కోసం కూడా అడిగారు. ఆ సమయంలో చేయలేకపోయాను.  భవిష్యత్తులో లూసిఫర్‌ 2 మూవీ కూడా తీస్తాను. ఆ మూవీ హక్కులను కూడా చిరంజీవి తీసుకుని డైరెక్షన్‌ చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తాను’’ అని తాజా ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: