పవన్ కళ్యాణ్ తన రెండు పడవల ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఏదోవిధంగా రాబోయే ఎన్నికలలో తన సత్తా చాటాలని గట్టిప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ ఇస్తున్న లీకులకు తెలుగుదేశం నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుండి కానీ సరైన స్పందన రాకపోవడంతో పవన్ ఎంచుమించు తన వంటరి పోరాటానికి సిద్ధం అవుతున్నాడు అనుకోవాలి.


అక్టోబర్ నుండి ప్రారంభం కాబోతున్న తన బస్సు యాత్రకు యాక్షన్ ప్లాన్ పవన్ తయారు చేసుకుంటున్నాడు. ఇప్పటికే దాని ఏర్పాట్లు ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘జనసేన’ పార్టీ వ్యవహారాలలో చాలకీలకంగా వ్యవహరిస్తున్న పవన్ బస్సు యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దానికి మెగా అభిమానుల అండతో పాటు మెగా హీరోల సపోర్ట్ కూడ ఉండే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ ను డిజైన్ చేసినట్లు టాక్.


ఈవ్యూహంలో భాగంగా రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ లతో పవన్ బస్సు యాత్ర సక్సస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ కొన్ని వీడియో బైట్స్ రికార్డ్ చేయించి వాటిని ఛానల్స్ లో ప్రచారం చేయిస్తే మెగా అభిమానుల పూర్తి సపోర్ట్ జనసేన కు ఉంది అన్న అభిప్రాయం అందరిలో కలుగుతుందని నాగబాబు ఆలోచన అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా త్వరలో రామ్ చరణ్ అల్లు అర్జున్ లు కలిసి పవన్ ను వ్యక్తిగాతంగ్ఫా కలవడమే కాకుండా బస్సు యాత్ర విజయానికి తమవంతు సహాయంగా ఏమి చేయాలి అన్న విషయమై చర్చించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


గత ఎన్నికలలో అల్లు అర్జున్ స్వయంగా నరసాపురం వెళ్ళి అప్పటి ఎన్నికలలో పోటీ చేస్తున్న నాగబాబుకు ఓటు వేయమని స్వయంగా అడిగినప్పటికీ నాగబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ లు ఓడిపోయిన విషయం తెలిసిందే. గతంలో ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అప్పటి సమైఖ్య ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశానికి ఓట్లు వేయించాలని ఎంత ప్రచారం చేసినప్పటికీ అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయి కాంగ్రెస్ నెగ్గిన విషయం తెలిసిందే. దీనితో మెగా హీరోలు ఎంత ప్రచారం చేసినా బస్సు యాత్రకు జనం వస్తారు కానీ ఓట్లు ఎంతవరకు ‘జనసేన’ కు పడతాయి అన్న కన్ఫ్యూజన్ చాలామందిలో ఉన్నట్లు టాక్..మరింత సమాచారం తెలుసుకోండి: