మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్కారు వారి పాట ఈ చిత్రం మే 12న విడుదలై మంచి టాక్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా సర్కార్ వారి పాట మూవీ అమెజాన్ ప్రైమ్ లో మూడు వారాల్లోనే పే పర్ ఫ్యూ ఈ విధంగా ఓటీటీ లో కి రావడం జరిగింది. అయితే ఇప్పుడు సాధారణ సబ్స్క్రైబ్ కూడా వీటిని ఫ్రీగా చూడవచ్చు.. అయితే ప్రైమ్ వీడియో మరియు మేకర్స్ మహేష్ సినిమా ఓటిటి గురించి పెద్దగా ప్రచారం చేయలేదు.


థియేటర్లో చూడని వారు చాలామంది ప్రస్తుతం ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ పైన చూస్తున్నారు. అయితే సర్కార్ వారి పాట సినిమా థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి టాక్ వచ్చింది ఓ టీ టీ లో కూడా అలాంటి టాక్ తెచ్చుకుంటోంది. ఒక సూపర్ స్టార్ ని పెట్టుకొని పరశురాం ఇలాంటి సినిమా తీయగలిగారు.. మహేష్ ఈ కథను ఎలా ఒప్పుకున్నారు అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్ల నేపథ్యం లో ఈ సినిమా కథను బాగానే తెరకెక్కించారు.


కానీ ఈ సినిమా కథ మాత్రం ఆడియన్స్ను  పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థ గురించి బాగా తెలిసిన వారు సినిమా చూసి ట్రొల్ చేస్తున్నారు. ఇక ఇందులో ఒక బిగ్ షాట్ బ్యాంకు నుంచి పదివేల కోట్ల రుణం తీసుకొని చెల్లించకుండా బ్యాంకు అధికారి ని అరెస్టు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆయన బ్యాంక్ ఆఫీసర్ లంచం తీసుకుంటే..  చట్టవిరుద్ధమైన ప్రయోజనాలు చేపడితే అరెస్టు చేయాలి కానీ అలా చూపించలేదు అంతేకాకుండా హీరో పాత్రకు సినిమాలో సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయారు ఆన్నట్లుగా టాక్  వినిపిస్తోంది. అయితే ఈ సినిమా మొత్తానికి మహేష్ వల్లే అన్ని కోట్లు సాధించిందని మాట వాస్తవమని ఓటిటి ఆడియన్స్ తేల్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: