ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా వార్తల్లో నిలిచే హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ సమంత తప్పకుండా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో పాజిటివ్ గా వార్తల్లోకి ఎక్కడం లేదా నెగిటివ్ గా వార్తల్లోకి ఎక్కడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా సమంత ఎక్కువగా నెగెటివిటీ విషయమై వార్తల్లోకి ఎక్కడం ఆమె అభిమానులను ఎంతగానో బాధిస్తుంది. ముఖ్యంగా అక్కినేని అభిమానులు నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఈమెను బాగానే ట్రోల్ చేస్తున్నారు.

విడాకుల విషయంలో తప్పు ఎవరిదైనా కూడా మాక్సిమం విడాకుల కేసులలో ఇద్దరి తప్పు ఉంటుంది. కాబట్టి చైతన్యను కాకుండా సమంతనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వారు. ఆమెను ఇంతలా ట్రోల్ చేయడం ఆమెను ఎంతగానో బాధపెడుతుంది అన్న విషయం పలుమార్లు బయటపడింది అక్కినేని అభిమానులు చేసే అతి ట్రొల్ తట్టుకోలేక సమంత రెండు మూడు సార్లు సోషల్ మీడియా వేదికగా స్పందించింది కూడా. ఇటీవలే శోభితా ధూళిపాళ విషయంలో కూడా ఆమె స్పందించింది. 

నాగచైతన్య పై సమంత అండ్ టీం నెగెటివ్ వార్తలు స్పీడ్ చేస్తున్నారంటూ కొంతమంది చేసిన ఆరోపణలపై ఆమె సమాధానం ఇచ్చారు. ఇద్దరి విషయంలో ఎవరిది తప్పు అనే విషయం బయట వ్యక్తులకు తెలియకపోయినా అందులో మిస్టేక్ సమంత దే ఎక్కువగా ఉంది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.  అందుకే ఈ రకమైన ట్రోల్స్ ఆమెపై జరుగుతున్నాయి.  ఆమె గతంలోనూ ఈ విధమైన ట్రోల్స్ ఎదుర్కొంది. గతాన్ని మరిచిపోయి సినిమాల పై ఫోకస్ పెట్టి వరుస చిత్రాలను చేస్తున్న సమంత ఇంకెన్ని రోజులు ఈ విధమైన నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.  ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమా చేస్తుంది. అంతేకాదు రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీ గా ఉంది. బాలీవుడ్ లో కూడా ఆమెకు అవకాశాలు వరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: