పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో ఏ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్క వలసిన రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లిన కూడా ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి చేయలేకపోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా యొక్క షూటింగ్ ను కొంత భాగం చేసింది చిత్రబృందం. మధ్యలో వేరే సినిమా చేయవలసి రావడం తో పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాడు.

దాంతో అప్పటి నుంచి క్రిష్ ఈ సినిమా చేయడం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయాన్ని తెచ్చి పెట్టిన దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆయనతో సినిమా అనౌన్స్ చేసుకున్నాడు కానీ ఇంకా దానిని మొదలు పెట్టకపోవడం పవన్ అభిమానుల ఎంతగానో నిరాశపరుస్తుంది ఈ రెండు చిత్రాలను పవన్కళ్యాణ్ ఎప్పుడో పూర్తి చేయవలసి ఉంది ఉండగా వాటిని ఇంకా మొదలు పెట్టక పోవడం వెనక కారణం ఏంటో తెలియక కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. 

త్వరలోనే ఈ సినిమా లో షూటింగ్ లు మొదలవుతాయి అన్న వార్తలు గత కొన్ని రోజులుగా వస్తుండగా తాజాగా పవన్ కళ్యాణ్ ఎవరికీ చెప్పకుండా తన కొత్త సినిమా ఓపెనింగ్ చేయడం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఈ విధంగా చేయడం వెనుక మతలబు ఏమిటో తెలియట్లేదు. సముద్రఖని దర్శకత్వంలో ఓ తమిళ సినిమా రీమేక్ తెలుగులో ఆయన చేయబోతున్నాడు. అతి తక్కువ సమయంలో విడుదల కాబోయే ఈ చిత్రం తర్వాతనే ఆయన బ్యాలెన్స్ లో ఉంచిన మిగతా సినిమాలు చేయడానికి సిద్ధమవుతాడట. అంతే ఆ ఇద్దరు దర్శకులు మరో రెండు మూడు నెలల దాకా ఈ సినిమా కోసం వేచి చూడవలసిందే అన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి: