కొన్ని సినిమాలకు ఎక్కడి నుంచి ఎలాంటి క్రేజ్ వస్తుందో ఎవరు చెప్పలేరు. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇతర భాషలలో ఆ సినిమా యొక్క రీమేక్ కు డిమాండ్ వస్తూ ఉంటుంది. హిట్ అయిన సినిమాలకు డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తెలుగులో చేసిన ఓ సినిమాకు ఇప్పుడు నార్త్ నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఇది కూడా పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమానే కావడం విశేషం.

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోసియం చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ మరియు రానా ఇద్దరు కూడా రీమేక్ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒరిజినల్ సినిమా కంటే తెలుగులో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమానే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది అన్న పేరు సంపాదించుకుంది. అలా ఈ సినిమాను వార్తలు మేకర్స్ చూసి దీనిని అక్కడ కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. 

వాస్తవానికి ఒరిజినల్ వెర్షన్ కు తెలుగు వెర్షన్ కు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. త్రివిక్రమ్ రచయితగా పని చేసిన ఈ సినిమా స్క్రీన్ ప్లే ను పూర్తిగా మార్చివేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రాశారు. అలా టాలీవుడ్ సినిమాలు ఇటీవల కాలంలో నార్త్ వారిని బాగా అలరిస్తున్న క్రమంలో ఈ సినిమా కూడా అక్కడివారికి బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాను నార్త్ లో రీమేక్ చేయాలనే ఆలోచన వారికి వచ్చినట్లుగా తెలుస్తుంది. తొందర్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టనున్నారు. ఏదేమైనా ఒరిజినల్ వెర్షన్ చూసిన తర్వాత రాని ఆలోచన రీమేక్ సినిమా చూసిన తర్వాత హిందీ మేకర్స్ కు రావడం నిజంగా తెలుగు సినిమాల ప్రభావం వారిపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: