సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. వారసులైన కొత్తగా వచ్చిన వారైనా సినిమాల్లో నిలదొక్కుకోవా లంటే తప్పకుండా వారు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. అప్పుడే వారికి సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కుతుంది. లేదంటే ఎలాంటి వారైనా సరే తొందర్లోనే వారి కెరీర్ కు స్వస్తి పలకాలసి వస్తుంది.  ఇప్పటిదాకా చాలా మంది నట వారసులు సినిమా పరిశ్రమలో రాణించలేక బయటకు వెళ్లిపోయారు.

అలాగే సినిమా పరిశ్రమకి స్వతహాగా వచ్చిన వారు కూడా ఇక్కడికి వాతావరణానికి పరిస్థితులకు ఇమడలేక వెళ్లిపోయిన వారు కూ డా ఉన్నారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి పోవడం అనే సూత్రాన్ని పాటించిన చాలామంది తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్స్ గా వెలుగుతున్నారు. అలా మహేష్ బాబు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆయన ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం చెబుతున్నారు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ఉన్నాడు ప్రస్తుతం మహేష్ బాబు. 

ఆయన సినిమాల పట్ల ఎంత జాగ్రత్తగా ఎంత స్పష్టత గా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. షూటింగ్ లోకేషన్ లో కూడా ఆ యన ఇతరుల పట్ల వ్యవహరించే తీరు ఎంతో బాగా ఉంటుంది అని అందరూ చెబుతూ ఉంటారు. దర్శకుల పట్ల ఆయన ఎంత మర్యాదగా ఉంటారో అందరూ దర్శకులు ఎప్పు డూ చెబుతూ ఉండేవారు. అయితే ఏదైనా సీన్ చిత్రీకరించేటప్పుడు దర్శకుడు కి  నచ్చే వరకు ఆ సీన్ చేయడం మహేష్ బాబు కు అలవాటు మొహమాటంతో దర్శకుడు వ ద్దని చెప్పినా కూడా వందకు వందశాతం ఓకే అంత వరకు ఆయన టేకుల మీద టేకులు చేస్తూనే ఉంటారట.  అందుకే కదా మహేష్ ఇప్పుడు ఇంతటి రేంజ్ కలిగిన హీరో గా ఎదిగాడు. ఊరికే సూపర్ స్టార్స్ ఎవరు అయిపోరు కదండీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: