తెలుగు సినిమా పరిశ్రమలో పలువురు ఇతర భాషల దర్శకుల సినిమాలి చేస్తూ ఉండడం జరుగుతుంది.  దీనిని బట్టి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో తెలుగులో సినిమాలు చేయడానికి ఇతర భాషలలోని టెక్నీషియన్లు ఎవరూ అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. హీరోలు కూడా డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే తెలుగు ప్రేక్షకులను పలకరించే వారు. కానీ నేరుగా సినిమాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ.

అయితే ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల రీత్యా ఇప్పుడు చాలామంది తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఇతర భాషలకు చెందిన అగ్ర హీరోలతో పాటు అగ్ర దర్శకులు కూడా ఉండడం విశేషం.  ఆవిధంగా ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న దర్శకులు ఎవరో చూద్దాం. తమిళ అగ్ర దర్శకుడు గా ఉన్న శంకర్ ఇప్పుడు తెలుగులో  చిత్రాలు చేస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి ఆయన ఓ భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.


ఇక రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాకి తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయాలని భావించిన కూడా అది వర్కౌట్ కాలేదు ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. వీరు మాత్రమే కాకుండా ఇంకొంతమంది తమిళ దర్శకులు కూడా తెలుగులో తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. కే ఎస్ రవికుమార్ కూడా కొన్ని తెలుగు సినిమలు చేశాడు ఇప్పటికే. 

మరింత సమాచారం తెలుసుకోండి: