పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు 25 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో ఈ పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉండగా ఇందులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వేసే స్టెప్పులు ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తాయని చెబుతున్నారు.

ఈ పాటలో ఆయనతో పాటుగా అనన్య పాండే స్టెప్పులు వేయబోతుందట. గతంలో ఆమెకు బదులుగా ఓ క్రేజీ హీరోయిన్ ను ఈ పాటలో చేయించాలని అనుకున్నారు. కానీ చివరకు హీరోయిన్ నే ఎంపిక చేశారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. తెలుగునాడు మొత్తం ఈ సినిమా కోసం ఇప్పుడు ఎదురు చూస్తూది. 

కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ చిత్రానికి చార్మి మరియు పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా నిర్మాతలగా వ్యవహరిస్తూ ఉండగా ఈ చిత్రం ఇప్పటికే పలు ఫ్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులను నమోదు చేసుకుంది. ఆ విధంగా రోజుకో కొత్త రికార్డులను విడుదల కాకముందే నమోదు చేసుకుంటున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనం రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.  ఈ సినిమాలో మైక్ తైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో రికార్డులను సృష్టిస్తుందో తెలియాలి అంటే ఆగస్టు 25వ తేదీ వరకు వేచి చూడవలసిందే. అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ పూరీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ అంతకు ముందు ఖుషి సినిమా తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మరింత సమాచారం తెలుసుకోండి: