ఒకప్పుడు సౌత్ హీరోలు మరియు టెక్నీషియన్లను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా చిన్న చూపు చూస్తూ ఉండే వారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి అని చెప్పవచ్చు. బాలీవుడ్ లో సౌత్ స్టార్స్ కు మరియు టెక్నీషియన్స్కు మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మనవాళ్లు హీరోలుగా హిందీ సినిమాలో కూడా నటించడం మొదలుపెట్టారు అంతేకాకుండా హిందీ సినిమాలకు టెక్నీషియన్లు కూడా వర్క్ చేస్తున్నారు. తాజాగా మరో సౌత్ సంగీత దర్శకుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.


తమిళ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ ఇప్పటికే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు.. వరుసగా హీరోగా మరియు సంగీత దర్శకుడిగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే కంగనారనౌత్ తో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఒక సెల్ఫీ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఈ సెల్ఫీ ని జీవి ప్రకాష్ షేర్ చేసిన తరువాత కంగనారనౌత్ తో పనిచేయడం కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారుదీంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారుతోంది ఇదే సమయంలో మరికొన్ని ప్రశ్నలు కూడా జనాల్లోకి చర్చలు జరుగుతున్నాయి. కంగనా రనౌత్ తో వర్క్ చేస్తున్నట్లు ప్రకటించిన జి.వి.ప్రకాష్ ఇంతకు ఆమెతో నటించబోతున్న రాలేదంటే ఆమె సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారని విషయం పై పలువురు ప్రశ్నించారు జరుగుతోంది. ఇక అసలు విషయం ఏమిటి అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించబోతున్నారా అనేది తమిళ మీడియాల నుంచి అందుతున్న సమాచారం. మరికొందరు మాత్రం జి.వి.ప్రకాష్ వెళ్లి కంగనతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు ఏమిటి అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: