టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజీ ఉన్న హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ మొదట హీరోగా కెరీర్ ని మొదలు పెట్టినప్పటికీ గోపీచంద్ హీరోగా నటించిన మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో గోపీచంద్ విలన్ గా కొన్ని సినిమాల్లో నటించాడు.

గోపీచంద్ విలన్ గా నటించిన జయం , వర్షం  సినిమాలు మంచి విజయం సాధించడంతో గోపీచంద్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా మంచి గుర్తింపు లభించింది. అలాగే గోపిచంద్,  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం సినిమాలో కూడా విలన్ గా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ గోపిచంద్ కు మాత్రం విలన్ గా మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. అలా విలన్ గా కెరియర్ లో అదిరిపోయే సక్సెస్ ను అందుకున్న గోపీచంద్ , ఆ తర్వాత మళ్ళీ హీరోగా నటించి మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న గోపీచంద్ తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించాడు.  

ఈ సినిమాను జూలై 1 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పక్కా కమర్షియల్ మూవీ సభ్యులు అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పక్కా కమర్షియల్ చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తాజా ప్రెస్ మీట్ లో గోపీచంద్ మాట్లాడుతూ...  తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని, ఎప్పుడు అయిన ప్రభాస్ తో నటించడానికి సిద్ధమే అని,  ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అని గోపిచంద్ తాజా విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: