టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత గుడుంబా శంకర్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.2004లో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 2017 వరకు గ్యాప్ లేకుండా సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసుకుంటూ అలా సుమారుగా ఆరు సంవత్సరాలపాటు బిజీగా గడిపింది. ఇక మామూలుగా కనుమరుగైపోయిన హీరోయిన్లు అడపాదడపా సెకండ్ ఇన్నింగ్స్ లో నటిస్తూ ఉండేవారు. కానీ మీరాజాస్మిన్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాలలో హీరోయిన్ గా ఉన్నంత వరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ .. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం అభిమానులకు చేరువ అవుతూ గ్లామర్ షో ని ప్రదర్శిస్తోంది.ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుకు అందాల కనువిందు చేస్తోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా నాలుగుపదుల వయసులో కూడా ఆమె తరగని అందం చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా బోల్డ్ ఫోటో షూట్లతో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మీరాజాస్మిన్ పై సర్వత్ర విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని శరీరమంతా కనిపించే లాగా ఫోటోలకు ఫోజు ఇచ్చిన మీరాజాస్మిన్ ను చూసి నెటిజనులు ఈ వయసులో నీకు ఇది అవసరమా అంటూ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల కోసం ఈమె చేస్తున్న ప్రయత్నం కనీసం ఇప్పటికైనా ఫలిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: