టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు ఆయన గోపీచంద్ కొంత కాలం క్రితం ఆరడుగుల బుల్లెట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని 2017 వ సంవత్సరంలో విడుదల చేయాలని చిత్ర బృందం అన్ని సిద్ధం చేసుకుంది. కానీ చివరి నిమిషంలో కొన్ని ఫైనాన్షియల్ సమస్యల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత ఈ మూవీ ని 'ఓ టి టి' లో విడుదల కాబోతుంది అని ప్రచారం కూడా నడిచింది .

కానీ అది కూడా జరగలేదు. ఎట్టకేలకు ఈ సినిమా కొంత కాలం క్రితమే విడుదల అయింది . అనేక సార్లు విడుదల వాయిదా పడి ఆఖరు కు విడుదలయిన ఆరడుగుల బుల్లెట్ సినిమా తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచి బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ మూవీ గా నిలిచింది. ఆరడుగుల బుల్లెట్ మూవీ లో గోపీచంద్ హీరోగా నటించగా నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించగా,   మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఇలా తెలుగు ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఆరడుగుల బుల్లెట్ మూవీ ని ప్రస్తుతం తమిళంలో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరడుగుల బుల్లెట్ మూవీ ని తమిళ్ లో డబ్ చేసి జూలై 2022 వ న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయిన ఈ సినిమా తమిళ్ ప్రేక్షకులను ఎ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మూవీ లో  హీరోగా నటించాడు. ఈ సినిమా జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: