అక్కినేని కుటుంబం నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసాడు నాగచైతన్య.అయితే దాని  తరువాతి కాలంలో తన రెండో సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతను ప్రేమించాడు.ఇకపోతే ఈ ఇద్దరు కూడా తమ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే  నాలుగేళ్ల తర్వాత మేము విడిపోతున్నాం అని అధికారికంగా ప్రకటించి కుటుంబాలకే కాక ఇటు అభిమానులతో సహా తెలుగు ప్రేక్షకులు అందరికీ షాక్ ఇచ్చారు. ఇకపోతే నాగచైతన్య మొదటి ప్రేయసి సమంతా అని అందరూ అనుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తనకు ముందే లవ్ స్టోరీ ఉందంటూ బయటపెట్టారు నాగ చైతన్య.ఇక అసలు విషయం ఏమిటంటే తాజాగా నాగచైతన్య థాంక్యూ అనే సినిమా చేశారు. 

అయితే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.ఇకపోతే  దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కాగా  ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది సినిమా యూనిట్. ఇకపోతే ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే కొన్ని పాటలు, పోస్టర్లు విడుదల చేశారు. ఇక వాటికి మంచి స్పందన కూడా లభించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫేర్వెల్ అంటూ సాగుతున్న ఒక పాటను సోమవారం నాడు మల్లారెడ్డి కాలేజీలో విడుదల చేసింది సినిమా యూనిట్.ఇకపోతే తాజాగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య అక్కడ ఉన్న విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే  వారితో తన కాలేజీ రోజుల్లో జరిగిన అనేక విషయాలను పంచుకుంటూ తనకు అప్పట్లో ప్రేమకథ ఉందనే విషయాన్ని వెల్లడించారు.పోతే  కాలేజీ రోజులు చాలా గొప్పగా ఉంటాయని, ఇప్పుడు బోర్గా అనిపించినా తర్వాత కాలేజీ రోజుల విలువ ఏమిటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక తాను కూడా కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ కాలేజీ అయిపోతుంది? నేనెప్పుడూ కెరీర్ స్టార్ట్ చేయాలి? అంతేకాదు  నా ప్రేమ విషయాన్ని ఎప్పుడూ మా ఇంట్లో చెప్పాలి అని ఎదురు చూశాను అంటూ నాగచైతన్య పేర్కొన్నారు.ఇక దీంతో సమంత నాగచైతన్య మొదటి లవ్ కాదని ఆయనకు కాలేజీ రోజుల్లోనే ప్రేమ కథ ఉందని అందుకే ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: