హీరో గోపి చంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్.. ఈ సినిమాను కూల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కుస్తున్నారు.అతని డైరెక్షన్ లో ఇప్పటివరకు వచ్చిన అన్నీ సినిమాలు మంచి హిట్ అవ్వడం తో ఈ సినిమా పై కూడా అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ అంశాలతో నింపేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలవడర ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుని రన్ టైమ్ ను లాక్ చేసుకుంది.


పక్కా కమర్షియల్ అంశాలతో వస్తున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు మారుతి తెరకెక్కించడని, ప్రేక్షకులు ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకుంటారని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్ కు కితాబిచ్చారట. ఇక ఈ సినిమాలోని మాస్ అంశాలు, మాస్ ప్రేక్షకులను అమితంగా కట్టిపడేస్తాయని సెన్సార్ సభ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది చిత్ర యూనిట్.


కంటెంట్ బలంగా ఉండటంతో ఈ సినిమా రన్ టైమ్ ను 2 గంటల 32 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లుగా చిత్ర యూనట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు కతాబివ్వడం, మంచి రన్ టైమ్ కు సినిమాను లాక్ చేయడంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇ క ఈ సినిమాలో గోపీచంద్ సరసన అంాల భామ రాశి ఖన్నా హీరోయన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. జూలై 1న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసుందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది...ఈ సినిమా హిట్ అయితే హీరో సుడి తిరిగినట్లే..


మరింత సమాచారం తెలుసుకోండి: