పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు పాన్ ఇండియా స్టార్.ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో బిజీ గా ఉన్నారు.అయితే ఈ సినిమాని  'కేజీయఫ్‌'  ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలావుంటే  ప్రస్తుతం ఈ సినిమాని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు.అయితే  ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్‌ ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇక ఆ ఇంటర్వ్యూలో  ప్రభాస్‌, సినిమా గురించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ''నాకు ప్రశాంత్‌ నీల్‌ చిత్రాలంటే చాలా ఇష్టం.  ఇక తన  కథలతో ఆయన ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంటారు. అంతేకాదు అలాంటి ప్రయాణంలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. పోతే చిత్ర బృందమంతా ఎంతో సహకారం అందిస్తోంది. ముఖ్యంగా  ప్రభాస్‌తో కలిసి పనిచేయడం అద్భుతం'' అని శ్రుతిహాసన్‌ తెలిపారు. అయితే ఈ చిత్రంలో తాను పోషిస్తున్న ఆద్య పాత్ర గురించి ఇప్పుడే ఏ వివరాలు బయటపెట్టలేనన్నారు.ఇదిలావుంటే సూపర్‌ హిట్‌ చిత్రం 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2' తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం,

 అంతేకాక ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారని తెలియడంతో 'సలార్‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అంతేకాకుండా ఈ సినిమాలో  జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే మరోవైపు, 'ఆదిపురుష్‌', 'ప్రాజెక్ట్‌ కె' (వర్కింగ్‌ టైటిల్‌)తో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. 'అర్జున్‌ రెడ్డి' ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్‌', మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. కాగా శ్రుతిహాసన్‌.. బాలకృష్ణ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.ఇక  గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి #NBK107 అనేది వర్కింగ్‌ టైటిల్‌..!!

మరింత సమాచారం తెలుసుకోండి: