ఇండస్ట్రీలోని అగ్రకుటుంబాలలో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచు విష్ణు మంచు మనోజ్ మంచు లక్ష్మి ప్రసన్న మోహన్ బాబు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో రాణించలేకపొతున్నారు. వీరి ముగ్గురులో మంచు మనోజ్ పరిస్థితి మరీ విచిత్రం. కొన్ని సమస్యలతో సతమతమైపోతున్న మనోజ్ గతకొంత కాలంగా ఎక్కడ ఉంటున్నాడో ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితి.ఆమధ్య ఆంధ్రప్రదేశ్ లో కొందరితో కలిసి రియలస్టేట్ వ్యాపారంలోకి మంచు మనోజ్ ఎంటర్ కాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి అయితే ఆ విషయం పై క్లారిటీ లేదు. ఇది ఇలా ఉండగా మనోజ్ సన్నబడటానికి యోగా డైటింగ్ చేస్తున్నాడని ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాడని ఒక టాక్. ఇతడు హీరోగా మొదలు పెట్టిన ‘అహం బ్రహ్మాస్మీ’ మూవీ మొదలై మళ్ళీ ఆగిపోయినట్లు తెలుస్తోంది.  దీనికికారణం ఈమూవీ దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా గాసిప్పులు రావడానికి ఒక కారణం ఉంది. ఇతడు మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాను మొదలుపెట్టాడు. ఈసినిమా కథ మంచు మనోజ్ తో ఆగిపోయిన సినిమా కధేనా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈవిషయమై వాస్తవాలు తెలియనప్పటికీ వరస ఫైయిల్యూర్స్ వస్తున్న శ్రీవిష్ణు రాజ్ తరుణ్ తో కూడ చాలామంది నిర్మాతలు సినిమాలు తీస్తుంటే మోహన్ బాబు వారసుడు అయిన మంచు మనోజ్ కి ఎవరూ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు.ఇది ఇలా ఉండగా మనోజ్ మీడియం రేంజ్ సినిమాలలో విలన్ పాత్రలు చేయడానికి ఓపెన్ గా ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ ఈవిషయంలో కూడ మనోజ్ కు అవకాశాలు రావడంలేదు. అయితే మంచు విష్ణు మాత్రం తన కెరియర్ కు సంబంధించి తన వేగాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం రెండు సినిమాలను తానే స్వయంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈవిషయంలో మనోజ్ మాత్రం తన మౌనాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు..
మరింత సమాచారం తెలుసుకోండి: