బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ తాజాగా రక్షాబంధన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన భూమి పడ్నేకర్ కథానాయికగా నటించింది . ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు . 

ఈ సినిమాలో దర్శకుడు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని , అనురాగాన్ని చూపించబోతున్నాడు . ఈ సినిమాను జి స్టూడియోస్ ,  కలర్ యెల్లో ప్రొడక్షన్స్ , కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది . ఈ ట్రైలర్ లో కూడా అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ లను, అలాగే వారి మధ్య జరిగే భావోద్వేగమైన సంఘటనలతో ఈ ట్రైలర్ మొత్తాన్ని దర్శకుడు చూపించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ట్రైలర్ పై టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించాడు.  

సోషల్ మీడియా వేదికగా రక్షాబంధన్ సినిమా ట్రైలర్ గురించి రామ్ చరణ్ స్పందిస్తూ...  అక్షయ్ కుమార్ సార్ రక్షాబంధన్ ట్రైలర్ చాలా బాగుంది. ఒక సోదరుడు మరియు సోదరి యొక్క అందమైన మరియు పవిత్రమైన బంధాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. అంటూ రామ్ చరణ్ రక్షాబంధన్ ట్రైలర్ పై స్పందించాడు. రామ్ చరణ్ పోస్ట్ కి కామెంట్ గా అక్షయ్ కుమార్ స్పందిస్తూ... చాలా ధన్యవాదాలు రామ్ చరణ్ అన్న అని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పంపించాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోలకు సంబంధించిన పోస్ట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: