నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితమే టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా, ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి, బాలకృష్ణ తో తెరకెక్కించబోయే సినిమాను తన స్టైల్ లో కామెడీ జోనర్ లో కాకుండా బాలకృష్ణ స్టైల్ లో మాస్ జోనర్ లో తెరకెక్కించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమా స్క్రీన్ ప్లే పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా కథకు సంబంధించిన అన్ని పనులను చక చకా  పూర్తి చేసి ఆగస్టు నెల నుండి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ల వయస్సు వ్యక్తిగా కనిపించబోతున్నట్లు,  అతనికి కూతురుగా శ్రీ లీల కనిపించబోతున్నట్లు, ఈ సినిమా తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో తెరకెక్కబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: