ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరో కమల్ హాసన్ కు ఎట్టకేలకు భారీ విజయం దక్కింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను అందుకుంది. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్లను సైతం బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను అందుకున్న చిత్రంగా నిలిచింది విక్రమ్ సినిమా. విశ్వనాథుడు కమలహాసన్ ఈ సినిమా విజయంతో చాలా ఆనందంగా ఉన్నారు. దీంతో చిత్ర బృందానికి ఏదో ఒక కానుక ఇస్తూనే ఉన్నారు.


ఇక ఈ సినిమాని ఓటీటి లో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కమల్ హాసన్ అభిమానులు సినీ ప్రేక్షకుల సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదివరకే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా మరొక ఒక పవర్ ఫుల్ వీడియో తో విడుదల తేదీనీ క్లారిటీ ఇచ్చారు చిత్రబృందం. జూలై 8 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒకేసారి అన్ని భాషలలో విక్రమ్ సినిమా విడుదల కానున్నట్లు తెలియజేశారు.

తప్పకుండా ఈ సినిమాకు ఓటీటి లో మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉన్నట్లుగా  తెలుస్తోంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్రమ్ సినిమా దాదాపుగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి కమలహాసన్ రూ.200; వందల కోట్లకు పైగా కలెక్షన్లను దాటి నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం విజయానందంలో డైరెక్టర్కు ఖరీదైన కారును కూడా బహుమతి ఇచ్చారు. అలాగే ప్రత్యేకమైన పాత్రలో నటించిన సూర్యాకు ఖరీదైన రోలెక్స్ వాచ్ ను కూడా ఇచ్చారు. అంతేకాకుండా విక్రమ్ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టి వారందరిని సత్కరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: